26 రోజులు..రూ.1,865 కోట్ల మద్యం అమ్మకాలు
హైదరాబాద్: కరోనా లా డౌన్ నిబంధనలు సడలించిన తొలి నెలలో మద్యం అమ్మకాలు ఆశించిన స్థాయిలోనే జరిగాయి. గత నెల ఆరో తేదీన రాష్ట్రంలో వైన్ షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతివ్వగా... 26 రోజుల్లో రూ.1,864.95 కోట్ల విలువైన మద్యం కొనుగోళ్లు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో రూ.800 కోట్ల విలువైన బీర్లు, రూ. 1,000 కోట్ల విలువైన లిక్కర్ అమ్ముడు పోయాయి.