పర్యావరణ పరిరక్షణతోనే మనుగడ
కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 5 : జీవకోటి మనుగడకు జీవనాధారమైన పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బౌరంపేట రిజర్వు ఫారెస్ట్ లో రూ.1.40 కోట్ల వ్యయంలో ఏర్పాటు చేసిన సర్పాల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి భాద్యత అని తెలిపారు. . జీవవైవిధ్యంలో అనేక జీవరాశుల మనుగడకు పర్యావరణ సమతుల్యతలే ప్రధానంగా తోడ్పడుతాయన్నారు. ఒక జీవి మనుగడ మరో జీవి మనుగడకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపయోగ పడటం వల్లనే సకల జీవులు మానవాళిలో మనుగడ సాగిస్తున్నాయన్నారు. జీవవైవిధ్య చక్రంలో ఒక బంధం తెగితే దాని ప్రభావం అనేక రూపాల్లో కనిపిస్తాయని, పాములు నాశనమైతే ఎలుకలు, క్రిమి కీటకాలు సంతతి అనుహ్యంగా పెరిగిపోతుందని చెప్పారు. దానితో అవి పంటలపై పడి తిండి గింజలను తినేస్తాయని అందుకే సృష్టిలోని ఏజాతి ఉనికైనా జీవ వైవిధ్యం ఎంతో అవసరమ న్నారు. జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో భాగంగా చెన్నైలోని గిండి స్నేక్ పార్క్ కు ధీటుగా స ర్పాల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఎవరైకైనా పాములు కనిపిస్తే, వాటికి హాని తలపెట్టకుండా ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ (రెస్క్యూ టీం) వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా