NANDI TIMES

పదివిద్యార్థులకు, శానిటైజర్ల పంపిణీ



హైదరాబాద్: పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థలు ఔదార్యం చూపాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో పరీక్షలు రాయనున్న 82వేల మంది విద్యార్ధులు, 11వేల మంది సిబ్బందికి రూ.26లక్షల విలువైన మాస్కులు, శానిటైజర్లు అందించేందుకు యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, జన్య ఫౌండేషన్ సంస్థలు ముందుకొచ్చాయి. వీరితోపాటు నాట్కో సంస్థ తరఫున 5వేల మాస్కులు, అప్పిడి టెక్నాలజీస్ నిర్వాహకులు 256 లీటర్ల శానిటైజర్లను అందించనున్నారు. గురువారం డీఈవో బి.వెంకటనర్సమ్మతో కలిసి ఆయా సంస్థల ప్రతినిధులు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతిని కలిశారు. మాస్కులు, శానిటైజర్ల పంపిణీపై చర్చించారు.