దోమ తెరల వాడకంపై అవగాహన
హైదరాబాద్ (ములకలపల్లి):మలేరియానివారణలో ప్రజలు భాగస్వాములు కావాలని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. మంగపేట పీహెచ్ సీ ఆధ్వర్యంలో ములకలపల్లి మండలం కొమ్ముగూడెంలో గురువారం దోమతెరలు పంపిణీ చేశారు. జిల్లా మలేరియా అధికారి మోకాళ్ల వెంకటేశ్వరావు, సర్పంచి సుధీర్, జడ్పీటీసీ సున్నం నాగమణి, ఎంపీపీ నాగమణి, వైద్యాధికారి అనిత, ప్రాంతీయ మలేరియా అధికారి కృష్ణయ్య, పాల్గొన్నారు.