న్యాయం చేయాలని వినతి
హైదరాబాద్ (కరీంనగర్): బెజ్జంకి, కల్లెపల్లి శివార్లలోని చెరువులు, కుంటలు కాళేశ్వరం జలాలతో నిండటంతో తమ భూములు నీట మునిగి నష్టం వాటిల్లిందని, న్యాయం చేయాలని పలువురు రైతులు కోరారు. ఈ మేరకు గురువారం కరీంనగర్ లో ఎంపీ సంజయ్ కుమార్ ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు బాధితులు తెలిపారు. ఎక్కువ చెరువు, కాశమ్మకుంట, ఊర చెరువులు నిండటంతో తమ భూములు ముంపునకు గురయ్యాయని, పలుచోట్ల కోతకు గురవడంతో పంటలు సాగు చేసుకునే పరిస్థితి లేదన్నారు. ముంపునకు గురైన భూములను ప్రభుత్వం భూసేకరణ చట్టం ద్వారా సేకరించి పరిహారం అందించేలా చొరవ చూపాలన్నారు.